అమెజాన్‌తో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం.. లక్షమందికి ఫ్రీగా ఏఐ, క్లౌడ్ ట్రైనింగ్

1 hour ago 1
తెలంగాణలో యువతకు భవిష్యత్తు టెక్నాలజీలపై నైపుణ్యాలు అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అమెజాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. టాస్క్ ద్వారా 643 అనుబంధ కళాశాలల్లోని లక్ష మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐలో ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 900కు పైగా కోర్సులకు ఏడాది పాటు ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు అంతర్జాతీయ సర్టిఫికేషన్ పరీక్షలకు రాయితీ వోచర్లు అందించనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకూ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. టీచర్లకు టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించనున్నారు.
Read Entire Article