బంగాళాఖాతంలో మురసు తుఫాన్ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంగోలు సమీపంలో తీర దాటే ఛాన్స్ ఉంది. దీంతో భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మురసు తుఫాన్ కదలికలను చెన్నై, మచిలీపట్నం, విశాఖ డాప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేశారు.