తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి పదవీ కాలం ఇటీవల ముగియడంతో టీటీడీ రోజువారీ నిర్వహణ.. పరిపాలనా పనులు సాఫీగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ జీవో నెంబర్ 658 ద్వారా అధికారిక నియామకాలను ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉండే పూర్తి అధికారులు, బాధ్యతలను ఈ ప్రత్యేక అథారిటీకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కమిటీలో ఉన్నతాధికారులు ఉంటారు. ఈ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా టీటీడీ ఈవో, సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు.