KCR First Time US Tour: గులాబీ బాస్ కేసీఆర్ అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జీవితంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నా.. రెండు పర్యాయాలు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కేసీఆర్.. తన జీవితకాలంలో ఇప్పటి వరకు అమెరికాకు వెళ్లకపోవటం గమనార్హం. అయితే.. తాను సీఎంగా ఉన్న సమయంలో కేవలం రెండే రెండు విదేశీ పర్యటనలు చేపట్టిన కేసీఆర్.. ఇప్పుడు అమెరికాకు వెళ్తుండటం విశేషం.