అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నల్గొండ జిల్లాకు చెందిన యువతి మృతి

1 hour ago 1
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన గడసు నవ్య అనే యువతి షికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఎంఎస్ పూర్తి చేసి పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నవ్య.. స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో చెరువుగట్టులో విషాదం నిండింది. నవ్య భౌతికకాయాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులు, తానా, ఆటా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Read Entire Article