అమెరికా కాన్సాస్ స్టేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్ స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు మృతి చెందగా.. అతడి మృతికి అపార్ట్‌మెంట్ నిర్వహకులను అక్కడి కోర్డు బాధ్యులను చేసింది. వారి కారణంగానే యువకుడు మృతి చెందినట్లు తీర్పు ఇవ్వటమే కాకుండా.. బాధిత కుటుంబానికి రూ.5.40 కోట్లు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.