నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. మధు యాష్కీ, భార్య సుచీతో కలిసి డాక్టర్ అయిన తమ కుమార్తెను బోస్టన్‌లో మాస్టర్స్ కోర్సులో చేర్పించేందుకు బోస్టన్ వెళ్లారు. అనంతరం న్యూయార్క్‌కు వేర్వేరు వాహనాల్లో బయలుదేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.