అమెరికాలో సంభవించిన వరదల్లో తెలుగు యువకుడు గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ అమెరికాలోని ఒమాహాలో నివశిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద పరిస్థితులు తలెత్తగా ఆ వరద నీటిలో వెంకటేష్ కొట్టుకుపోయాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్రాల మంత్రులకు లేఖలు రాశారు.వెంకటేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరాలంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు లేఖలు రాశారు.