ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా మహిళ రాజధాని అమరావతి కోసం రూ.కోటి విరాళంగా అందజేశారు. మంగళవారం సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుని కలిసిన విజయలక్ష్మి అనే మహిళ రూ.కోటి విరాళం చెక్ అందించారు. విజయలక్ష్మి తన అమ్మ కోరికను నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని అమ్మి మరీ కోటి రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు విజయలక్ష్మిని అభినందించారు.