తెలంగాణలో సంచలనంగా మారిన మీర్‌పేట మాధవి హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. మొదట భార్య వివాహేతర సంబంధం అనుకుంటే.. ఆ తర్వాత భర్త వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. ఆ తర్వాత.. భార్యను ముక్కలుగా నరికి ఉడికించి ఎండబెట్టి పొడిచేసి చెరువులో కలిపినట్టుగా నిందితుడే చెప్పగా.. అందుకు ఓ మలయాళ థ్రిల్లర్ సినిమానే ప్రేరణ అని పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది.