Visakhapatnam Teen Ends Life: విశాఖపట్నంలో ఓ విద్యార్థి తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కొడుకు భవిష్యత్ కోసం ఉన్న ఊరిని వదిలి నగరానికి వచ్చారు.. అయితే పిల్లవడానికి మంచి చదువు అందించాలని ఆలోచించి వారు తీసుకున్న నిర్ణయం ఆ కుమారుడికి శాపమైంది. అక్కడ హాస్టల్‌లో ఒంటరిగా ఉండలేక మనోవేదనకు గురయ్యాడు. చదువుకోలేకపోతున్నానని చెప్పినా, తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో హాస్టల్‌లోనే ఉండిపోయాడు. అయితే, ఊహించని విధంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆ విద్యార్థి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేసింది.