కొత్త సంవత్సరం వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోటి విద్యార్థినికి పదో తరగతి విద్యార్థి న్యూ ఇయర్ విషెస్ చెప్పగా.. ఆ అమ్మయి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ పిల్లాడిపై దాడి చేశారు. దాడి చేయటాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆ అబ్బాయి.. సాయంత్రం సమయంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలిసి.. ఆ అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.