హైదరాబాద్ నగర శివారులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ట్రాప్ చేసి కిడ్నాప్ చేయటం కలకలం రేపింది. ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయంటూ అమ్మాయితో కాల్ చేయించి రప్పించిన దుండగులు.. డ్రైవర్‌తో పాటుగా వ్యాపారిని కిడ్నాప్ చేశారు. తూపాకీతో బెదిరించి ఓ నిర్మానుష్య ప్రాంతంలోని గదిలో బంధించారు. రూ.కోటి డబ్బులు డిమాండ్ చేయగా.. తమ వద్ద నగదు లేదని చెప్పటంతో తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకోని వదిలేశారు.