సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. సోషల్ మీడియాలో జరుగుతున్న మరో మోసంపై యువతను అప్రమత్తం చేశారు. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల పేరుతో నెట్టింట జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న మోసాలను వివరిస్తూ అమ్మాయిలు, యువతులను అలర్ట్ చేశారు. ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు పెట్టి, అమ్మాయిలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటి కేటుగాళ్ల వలలో పడొద్దంటూ హెచ్చరించారు. ఇలాంటి మోసాలను గమనిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.