శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు తరలి వెళ్తున్నారు. దర్శనాలు ప్రారంభమైన నేపథ్యంలో శబరిగిరులకు భక్తుల తాకిడి పెరిగింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా శబరిమలకు అధిక సంఖ్యలో యాత్రికులు వెళ్తుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు తీసుకువచ్చింది. శబరిమలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని టెక్కలి డిపో యాజమాన్యం తెలిపింది.