అయ్యప్స మాలధారిపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత

4 weeks ago 3
అన్నమయ్య జిల్లాలో ఓ అయ్యప్ప భక్తుడిపై దాడి స్థానికంగా వివాదానికి దారి తీసింది. మదనపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెంకటేష్ అనే అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి ఓ వ్యక్తి దాడికి దిగాడు. బైకు రోడ్డుకు అడ్డంగా ఉంది కాస్త పక్కకు పెట్టమని చెప్పినందుకు జియావుల్ హుక్ అనే ముస్లిం యువకుడు దాడి చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప మాలధారుడి చొక్కా చింపేసి దాడి చేయడంతో చుట్టుపక్కల వాళ్లంతా గూమికూడారు. వెంకటేష్‌ స్వామిపై చేసిన దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ జీవిస్తున్నారు. ఈమధ్య కాలంలోనే చిన్న చిన్న విషయాలను అడ్డుపెట్టుకొని మతపరమైన ఘర్షణలకు దిగుతున్న సంఘటనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Read Entire Article