మల్లీశ్వరీ సినిమాలో బ్యాంకు మేనేజర్ వచ్చి.. ప్రసాదూ అని పిలవగానే నలుగురు ఐదుగురు లేస్తే.. మీరు కాదయ్యా.. పెళ్లికాని ప్రసాదూ.. అనటంతో అసలు హీరో లేచి నిలబడతాడు. అలా ప్రతి ఒక్కరికి పేరుతో పాటు ఓ చిన్న తోక కూడా ఉంటుంది. అయితే ఆ తోక ప్రతిసారి అవసరం పడదు. ఒకే పేరు ఉన్న వ్యక్తులు ఒకే చోట ఉండటమో.. మనకు కావాల్సిన వ్యక్తిని వెతికినప్పుడో అవసరం పడుతుంది. ఒకవేళ ఆ తోక లేకపోతే.. ఎంత కష్టం వస్తుందో ఈ రియల్ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది.