Visakhapatnam To Araku Special Train From December 28th: అరకు వెళ్లే వారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ సీజన్‌లో అరకు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకులోయ (08525) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ విషయంపై వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకులోయ చేరుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో 08526 నంబరుతో ఈ రైలు అదేరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు విశాఖ వస్తుంది.