అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త.. ఐదేళ్ల తర్వాత అరకు ఉత్సవ్ మళ్లీ వచ్చేసింది. జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు అరకు చలి పండుగ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలెట్టారు. తాజాగా అరకు చలి పండుగకు ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అరకు ఉత్సవ్‌కు కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరకు చలి పండుగతో పాటుగా ఫ్లెమింగ్ ఫెస్టివల్‌కు కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ అరకు ఉత్సవ్ జరగనుంది.