అరకు లోయ అందాలను చూడ్డానికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు తరలివస్తుంటారు. సందర్శకులను ఆకర్షించడంలో అరకు లోయలో అందాలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి పద్మాపురం బొటానికల్ గార్డెన్. పర్యాట కేంద్రమైన పద్మాపురం గార్డెన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా జనవరి 11వ తేదీ వరకు పద్మాపురం బొటానికల్ గార్డెన్‌ను అధికారులు మూసివేశారు. తొమ్మిది రోజులు పాటు గార్డెన్‌లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. గార్డెన్ మూసివేయటంతో ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన హాట్ ఎయిర్ బెలూన్ కూడా అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని అధికారులు సూచించారు. పద్మాపురం గార్డెన్స్ అరకు బస్ స్టేషన్ నుంచి 2.5 కి. మీ, అలాగే విశాఖపట్నం నగరానికి 12 కి. మీ దూరంలో ఉంది. అరకు లోయలోని ప్రసిద్ధ సందర్శనా స్థలాలలో ఇది ఒకటి.