అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల బాలుడికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అండగా నిలిచారు. ఉరవకొండకు చెందిన కుమ్మరి లోకేష్ అరుదైన ప్రైమరీ హిమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్‌తో ఇబ్బంది పడుతున్నాడు. తమ పరిస్థితి గురించి చిన్నారి తల్లిదండ్రులు ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని సింధు ఆస్పత్రి యాజమాన్యానికి సూచించిన పయ్యావుల కేశవ్.. చిన్నారి చికిత్స కోసం ఐదు రోజుల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7.5 లక్షలు మంజూరు చేయించి లోకేష్ తల్లికి అందజేశారు.