హైదరాబాద్ కేపీహెచ్‌బీలోలోని వసంత నగర్‌లో అర్ధరాత్రి సమయంలో జరిగిన ఓ ఘటన.. అందరినీ భయాందోళనకు గురి చేసింది. గాఢ నిద్రలో ఉన్న భార్య మెడలో ఏదో చల్లగా తాకటంతో.. ఉలిక్కిపడి లేచి చూసుకోగా.. మెడలో ఉన్న తాళి కనిపించలేదు. దీంతో.. ఎవడో దొంగ తాళి ఎత్తుకుపోయాడని అందరూ హడావుడి చేశారు. కానీ.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.