అర్హత ఉన్న ఒక్క ఓటరూ హక్కును కోల్పోవద్దు.. SIRపై ఈసీకి సీఎం రేవంత్ కీలక ప్రతిపాదనలు

2 hours ago 1
తెలంగాణలో SIR ప్రక్రియ సందర్భంగా 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలు ASDD జాబితాలోకి వెళ్లడంపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వీరిలో 45.19 లక్షల మందిని శాశ్వతంగా తరలిపోయినవారిగా గుర్తించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఇంట్లో లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేర్చొద్దని, షిఫ్టెడ్‌ ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని కోరారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని, హెల్ప్‌డెస్క్‌లు, అదనపు ఈఆర్‌వో సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన ఓటర్లు ఎవరూ తుది జాబితా నుంచి తొలగిపోకూడదని ఆయన స్పష్టం చేశారు.
Read Entire Article