దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వరంగల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి ప్రయాణికుల వసతులు, నిర్వహణ, అమృత్ భారత్ స్టేషన్ పనులను పరిశీలించారు. రూ.25.41 కోట్లతో చేపడుతున్న ఆధునికీకరణలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, వెయిటింగ్ హాళ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫామ్ షెల్టర్లు ఉన్నాయి. అంతకుముందు సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో ఫుట్‌ప్లేట్ తనిఖీ నిర్వహించి ట్రాక్, సిగ్నలింగ్, విద్యుత్ లైన్లను పరిశీలించారు.