Talliki Vandanam Scheme 2025 Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం లబ్ధిదారులకు డబ్బులు జమ చేయడంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. అర్హులైన కొందరికి ఇంకా డబ్బులు చేరకపోవడంతో, ప్రభుత్వం స్పందించి ఈ నెల 30 నాటికి అర్హుల జాబితాను సిద్ధం చేయనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే బ్యాంకు లేదా పోస్టాఫీసులలో ఆధార్ అనుసంధానంతో అకౌంట్లు తెరవాలని అధికారులు సూచిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 5న ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు డబ్బులు జమ చేస్తారు.