తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఏర్పాటుచేస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాము ఉచిత విద్యుత్ పథకం రద్దుచేసినా.. మోటార్లకు మీటర్లు బిగించినా ఎన్నికల్లో పోటీచేయబోమని తేల్చిచెప్పారు. ఒకవేళ, ఫ్రీ కరెంట్ కొనసాగితే ఎన్నికల్లో పోటీ నుంచి ప్రతిపక్ష పార్టీ తప్పుకుంటుందా? అని ఆయన ఛాలెంజ్ చేశారు.