తెలంగాణలో కొన్ని గంటల్లో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బిగ్ బాంగ్ పేల్చారు. రేవంత్ రెడ్డి సర్కార్‌ను హెచ్చరిస్తూ.. అలా చేస్తే మాత్రం ఒక్క ఇల్లు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వబోమని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రధాన ఆవాస్ యోజన పథకం పేరు పెట్టాలని.. రేషన్ కార్డులపై కాంగ్రెస్ ఫొటోలు పెట్టకూడదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అలా చేస్తే మాత్రం కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వదని తెగేసి చెప్పారు.