పథకాల కోసం అర్హులైన వారెవరూ ఎవరికీ రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్‌లో 4 పథకాలు ప్రారంభించిన మంత్రి.. అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తేలితే వారికి మధ్యలోనే పథకాలను కట్ చేస్తామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామన్నారు.