తెలంగాణ ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు తానే ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారితీస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం