తిరుమల కొండపై ఓ కారు కలకలం రేపింది. అన్యమత వ్యాఖ్యలతో ఉన్న కారు అర్చక నిలయం వద్ద పార్కింగ్ చేయడం కలకలం రేపింది. అయితే అన్యమత వ్యాఖ్యలతో ఉన్న కారును తిరుమల కొండపైకి ఎలా అనుమతించారని భక్తులు మండిపడుతున్నారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద ప్రతిదీ తనిఖీ చేస్తారని.. మరి కారు ఎలా పైకి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలిపిరి చెక్ పాయింట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కారు కొండపైకి చేరుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.