అలిపిరిలో స్వామీజీల ఆందోళన.. ముంతాజ్ హోటల్‌కు వ్యతిరేకంగా నిరసన

1 month ago 4
తిరుపతిలోని అలిపిరికి సమీపంలో నిర్మిస్తోన్న ముంతాజ్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని నూతనంగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్‌ను చూస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించిన టీటీడీ బోర్డు.. ఆ హోటల్‌కు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తామని తెలిపింది. అయితే, టీటీడీ ఒక నిర్ణయం తీసుకున్నా.. ముంతాజ్ హోటల్ మాత్రం నిర్మాణ పనులను ఆపలేదని.. రహస్యంగా పనులు జరుపుతోందని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాల నాయకులు, స్వామీజీలు తిరుపతిలోని తుడా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. శ్రీవారి పవిత్రకు భగ్నం కలిగించే నిర్మాణాలపై తక్షణం తుడా అధికారులు చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో హిందూ ధార్మిక సంఘాలు కలిసి ఆందోళన ఉధృతం చేస్తాయని స్వామీజీలు హెచ్చరించారు
Read Entire Article