సీనియర్ నటుడు సుమన్ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌పై స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేదు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తప్పు. జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత తీసుకోవాల్సింది థియేటర్ యాజమాన్యమే అన్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో థియేటర్ కి వస్తున్నప్పుడు తగిన ఏర్పాట్లు చేయడం వారి బాధ్యతన్నారు. థియేటర్ వద్ద ఎంత మంది జనం ఉన్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలు మొత్తం యాజమాన్యమే చూసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ సంఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదని.. నటులు ఎవరైనా థియేటర్ కి వెళ్లొచ్చు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకోవాలి అన్నారు.