సంధ్య థియేటర్ ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్.. ప్రస్తుతం హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ మీద ఉండగా.. రెగ్యూలర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (జనవరి 03న) విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం.. రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో.. అల్లు అర్జున్‌కు ఈ కేసులో బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది.