ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిందిగా.. అంతా అయిపోయిందిగా.. మళ్లీ నోటీసులేంటీ అనుకుంటున్నారా..? అక్కడే పోలీసులు మరో మెలిక పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. పోలీసులు నోటీసులు జారీ చేశారు.