అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేస్తున్నారని సర్కార్‌పై మండిపడ్డారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కనపెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం కక్షగట్టినట్లు ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.