Shilpa Ravi Reddy On Pushpa 2 Movie: తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ సందడి కనిపిస్తోంది. బుధవారం రాత్రి నుంచే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా మొదలైంది.. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూశారు. అయితే బన్నీతో పాటూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కూడా సినిమా చూశారు.. సినిమా బావుందని ప్రశంసించారు.