అల్లూరి సీతారామరాజు జిల్లాలో సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. అనంతగిరి మండలం మూలగుమ్మి గ్రామ సమీపంలోని జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా నలుగురు యువతులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరిని స్థానికులు కాపాడారు. మృతులు జంబువలస గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదకర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సెల్ఫీల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.