Organ Donation: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అవయవదానంపై ప్రతిజ్ఞ చేశారు. ఆర్గాన్ డొనేషన్‌తో ఒక్కొక్కరు 8 మంది ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవయవదానానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. తమ వివరాలను నమోదు చేసుకున్న వారి వాట్సప్ నంబర్లకు ‘గర్వించదగిన అవయవ దాత’ కార్డును పంపిస్తామని గాయత్రీ కామినేని తెలిపారు.