అసెంబ్లీలో అధికార పక్షానికి షాక్.. మంత్రి సీటులో బీజేపీ ఎమ్మెల్యే

1 month ago 4
సెక్రెటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు రాజకీయ వివాదంగా మారింది. విగ్రహ రూపాన్ని మార్చేసిన కాంగ్రెస్.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. ఇదే సమయంలో తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి ప్రోటోకాల్ అంశంపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిని సీరియస్ గా తీసుకున్న బీజేపీ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎవరూ ఊహించని రీతిలో లేవనెత్తింది. అసెంబ్లీ సమావేశాల్లో జనగణమన పాడుతున్న సమయంలో ఏకంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీటులో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కూర్చున్నారు. మాటి మాటికీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తూ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇలా నిరసనకు దిగారు. నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు తనను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి అసెంబ్లీనే వేదికగా ఎంచుకున్నట్లు బీజేపీ స్పష్టం చేసింది. దీనిపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.
Read Entire Article