ఆ 4, 5 చెరువుల్లో మాత్రమే గణేష్ నిమజ్జనాలపై ఆంక్షలు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన

2 hours ago 1
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలపై హైడ్రా ఆంక్షలు విధించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. నగరంలోని అన్ని చెరువుల్లో నిమజ్జనాలను హైడ్రా అడ్డుకోవడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన 4, 5 చెరువుల్లో మాత్రమే పర్యావరణ పరిరక్షణ నిబంధనల కారణంగా పరిమితులు ఉన్నాయని చెప్పారు. అమీన్‌పూర్ చెరువును బయోడైవర్సిటీ ప్రాంతంగా, కాప్రా చెరువును నేచురల్ వెట్‌ల్యాండ్‌గా గుర్తించినందున అక్కడ ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయని వివరించారు.
Read Entire Article