పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం అంతకంతకు తీవ్రమవుతోంది. సెప్టెంబరు వచ్చిన పగటి ఉష్ణోగ్రతలు వేసవిని మించి నమోదవుతున్నాయి. ఒకటే ఎండలు, ఉక్కబోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకొచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.