సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారంలో సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ.2 లక్షల మెడికల్ రీయింబర్స్‌మెంట్ చెక్కును ఇప్పించేందుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడి నుంచి ఫిర్యాదు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. సచివాలయ ఆవరణలో లంచం తీసుకుంటున్న ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరో ఉద్యోగి పాత్ర ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.