బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా..? అని బాధపడిన రోజులు ఉన్నాయన్నారు. ఉద్యమ సమయంలో తన తండ్రి కేసీఆర్ విషయంలో ఓ ఐపీఎస్ అధికారి బెదిరిస్తే కన్నీరు పెట్టుకున్నానని.. ఆ తర్వాత తన కుమారుడి బాడీ షేమింగ్, తనపై తప్పుడు కామెంట్స్ చేస్తే బాధపడిన రోజులు ఉన్నాయన్నారు.