అందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. తాము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అందిస్తామని ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశంపై పలు అంశాలపై చర్చించింది. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో అందించిన సెంటు, సెంటున్నర ఇళ్ల స్థలాలను రద్దు చేసి, వాటి స్థానంలో రెండు, మూడు సెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.