ఆర్టీసీలోని ఏడు వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సోమవారం చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగానే ఏడు వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. మరోవైపు దీపావళి కానుక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.