సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నారు. మొదటి విడత ఎన్నికల విధులకు హాజరు కాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. సిద్ధిపేట, గజ్వేల్ డివిజన్‌ల పరిధిలోని ఏడు మండలాల్లో (దౌల్తాబాద్, రాయపోల్, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కుక్, ములుగు, వర్గల్) పోలింగ్ జరిగింది. జిల్లాలో 88.05% పోలింగ్ నమోదైంది. అత్యంత ముఖ్యమైన విధులకు నిర్లక్ష్యం వహించినందుకే ఈ సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.