Chaganti Koteswara Rao On Ysrcp Govt Post: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే చాగంటి ఈ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే చాగంటికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కూడా సలహాదారుడి పదవి ఇచ్చినా తీసుకోలేదు. అయితే గత ప్రభుత్వంలో పదవి ఎందుకు తీసుకోలేదో క్లారిటీ ఇచ్చారు.