ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఇక నుంచి వారు పర్మినెంట్ ఉద్యోగులు..

3 months ago 11
సింగరేణి సంస్థలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న 1,258 మంది ఉద్యోగులకు శుభవార్త. సీఎండీ ఎన్‌.బలరాం ఆదేశాల మేరకు.. వీరి సర్వీసును క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఈ ఉత్తర్వులు ఉద్యోగులకు అందనున్నాయి. భూగర్భ గనుల్లో 190 రోజులు లేదా ఉపరితలంలో 240 పనిదినాలు పూర్తిచేసిన వారు కేటగిరీ-1 జనరల్ అసిస్టెంట్లుగా శాశ్వత ఉద్యోగులుగా నియమితులు కానున్నారు. అత్యధికంగా రామగుండం-2 ఏరియాలో 303 మంది లబ్ధి పొందనున్నారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు.. యాజమాన్యం ఉత్తర్వుల జారీని వేగవంతం చేసింది.
Read Entire Article