ఆ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బిగ్ షాక్.. సేవలకు ఫుల్‌స్టాఫ్..

1 month ago 6
తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను నిలిపివేస్తున్నట్లు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 776 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను ఎంఎస్హెచ్ఆర్బీ (MHSRB) ద్వారా ప్రభుత్వం ఇటీవల రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసింది. కొత్తగా ఎంపికైన రెగ్యులర్ ఉద్యోగులు విధుల్లో చేరడంతో, ఆ స్థానాల్లో ఉన్న తాత్కాలిక సిబ్బందిని వెంటనే తొలగించాలని ప్రిన్సిపాల్స్ మరియు సూపరింటెండెంట్లను ఆదేశించారు. గతంలో 16,448 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగించాలని అనుమతించినప్పటికీ, రెగ్యులర్ నియామకాలు పూర్తయినందున ల్యాబ్ టెక్నీషియన్లకు ఆ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.
Read Entire Article