తెలంగాణలో ఇప్పటికే చాలా గ్రామాల్లో మద్యపానపై నిషేధం విధిస్తూ తీర్మానాలు జరగ్గా.. ఇప్పుడు మరో గ్రామంలోనూ మద్యనిషేధంపై ఏకగ్రీవ తీర్మానం జరిగింది. ఎక్కడో కాదు.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లిలోనే. గ్రామంలో బెల్టు షాపులు ఎక్కువైపోవటం వల్ల యువకులు, రైతు కూలీలు మద్యానికి బానిసలైపోతున్నారని.. ఈ తీర్మానం చేశారు. అయితే.. మద్యం అమ్మినవారికి రూ.60 వేలు జరిమానా, చెప్పినవారికి రూ.10 వేల నజరానా ఇస్తామని తీర్మానం చేశారు.